ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండో అధికార భాషగా ఉర్దూ అయింది. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్.. రెండో భాషగా ఉర్దూ ఉండాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా కేబినెట్ తమ నిర్ణయానికి ఆమోదం కూడా తెలిపింది. తాజా గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టింది. దీనికి ఎమ్మెల్యేలు మద్ధతు తెలిపారు. దీంతో ఉర్దూ భాష బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది.
కాగ ఉర్ధూ భాష బిల్లును అసెంబ్లీలో రాష్ట్ర డీప్యూటీ సీఎం అంజాద్ బాషా ప్రవేశ పెట్టారు. దీంతో శాసన సభ్యులు అందరూ కూడా ఈ ఉర్దూ బిల్లు కు ఆమోదం తెలిపారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ద్వితియ భాషగా ఉర్దూ అమల్లోకి రానుంది. కాగ ఉర్దూ ను అధికారికంగా భాషగా గుర్తించిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ధన్యవాదాలు తెలిపారు.
అలాగే నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ లో సమావేశాలు వాడీ వేడిగా జరిగాయి. ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు మద్యం బ్యాన్ పై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగ అధికారి ఎమ్మెల్యేలు, మంత్రులు టీడీపీ హాయంలోనే మద్యం, సారా ఏరులై పారిందని ఆరోపణలు చేశారు.