అమెరికాలో పోలింగ్ ముగియగా.. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలిగా విడుదలవుతున్న ఫలితాల్లో జో బైడెన్, ట్రంప్ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఇప్పటివరకు ట్రంప్‌కు 210, బైడెన్‌కు 154 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయ్. పాపులర్, ఎలక్ట్రోరల్ ఓట్లలో బైడెన్ ముందంజలో ఉన్నారు. టెక్సాస్‌లో బైడెన్ స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తుండగా.. ఇండియానాలో ట్రంప్ గెలిచారు. కాన్సస్, ఇల్లినస్, ఓహియో, పెన్సిలివేనియా, న్యూయార్క్‌లో బైడెన్ గెలుపొందారు. ఇప్పటికి బైడెన్ పది రాష్ట్రాల్లో, ట్రంప్ ఎనిమిది రాష్ట్రాల్లో పూర్తి విజయం సాధించారు.
మరోవైపు అత్యధిక పోలింగ్ శాతం నమోదవడం.. ఎవరికి ప్లస్ అనే విశ్లేషణలు జరుగుతున్నాయి. మెయిల్ ఓట్లలో అత్యధిక శాతం.. బైడెన్‌కే వస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. రిపబ్లికన్ మద్దతుదారులు.. ఎన్నికల రోజు ఓటు వేయడానికే ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది. అయితే మెయిల్ ఓట్లు పది కోట్ల వరకు రాగా.. ఓటింగ్ రోజు ఓటేసింది ఆరు కోట్ల మంది. ఈ లెక్కన బైడెన్ హవానే ఉంటుందని డెమోక్రాట్లు సంబరపడుతున్నారు.