తమ టాప్ కమాండర్ జనరల్ ఖాసీం సోలైమానీని అమెరికా కాల్చి చంపడంపై ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతుంది. అమెరికా బలగాలు ఉండే దాదాపు వంద ప్రాంతాలను ఇరాన్ టార్గెట్ చేసి దాడులు చేస్తుంది. వారం రోజుల నుంచి ఇరాన్ బలగాలు అమెరికా సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. వారం క్రితం ఇరాన్ బలగాలు, అమెరికా బేస్ క్యాంప్ లను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత 24 గంటల వ్యవధిలో మరో దాడి చేసాయి ఇరాన్ బలగాలు. ఇరాక్ లోని గ్రీన్ జోన్ పరిధిలో రాకెట్ లాంచర్లతో ఇరాన్ విరుచుకుపడింది. అంతకు ముందు ఇరాన్ వెనక్కు తగ్గకపోతే మాత్రం దాడులు చేస్తామని, ఆర్ధికంగా ఇబ్బందులు పెడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియా సమావేశం పెట్టి మరీ హెచ్చరించారు. ఈ దాడుల్లో తమకు నష్టం జరగలేదని అమెరికా ప్రకటించినా,
దాదాపు 80 మంది అమెరికా సైనికులు మరణించారని సమాచారం. ఇదిలా ఉంటే ఆదివారం ట్రంప్ మరోసారి ఇరాన్ కి వార్నింగ్ ఇచ్చారు. ఆ కాసేపటికే ఇరాన్ రంగంలోకి దిగింది. ఇరాక్ లోని బాగ్దాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ బలాద్ ఎయిర్ బేస్‌పై రాకెట్లతో విరుచుకుపడింది. మొత్తం 8 రాకెట్లు తమ స్థావరాన్ని ఢీకొట్టినట్టు ఇరాక్ తెలిపింది. ఈ దాడుల్లో మొత్తం నలుగురు గాయపడ్డారు. దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.