పుల్వామా ఉగ్రదాడిపై ట్రంప్ ఏమన్నారంటే?

-

పుల్వామా ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఈ ఆత్మాహుతి దాడి భయంకరమైనదిగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ఇప్పటికే తమకు రిపోర్టులు వచ్చాయని వెల్లడించిన ట్రంప్.. త్వరలోనే పుల్వామా ఉగ్రదాడిపై ఓ ప్రకటన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై త్వరలోనే తాము చేయాల్సింది చేస్తామని స్పష్టం చేశారు.

ఈ ఘటనపై అమెరికా విదేశాంగ శాఖ కూడా స్పందించింది. పుల్వామా దాడిపై భారత్ కు తాము అండగా ఉంటామని ఆ శాఖ స్పష్టం చేసింది. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ పాకిస్థాన్ ను కోరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version