ఎల్‌జీ ఆఫర్‌.. 7 రోజులు ఫోన్‌ను ఫ్రీగా వాడండి.. నచ్చకపోతే రిటర్న్‌ చేయండి..!

-

ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీదారు ఎల్‌జీ తన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఆ కంపెనీకి చెందిన ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. ఎల్‌జీ జీ8ఎక్స్‌ థిన్‌క్యూ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులు 7 రోజుల పాటు ఉచితంగా వాడుకోవచ్చు. తరువాత ఫోన్‌ నచ్చితే పేమెంట్‌ ఇచ్చి కొనుగోలు చేయవచ్చు. లేదా దాన్ని ఎలాంటి రుసుం చెల్లించకుండానే తిరిగి వెనక్కి ఇచ్చేయవచ్చు.

ఇక ఎల్‌జీ అందిస్తున్న ఈ ఆఫర్‌ను పొందాలంటే కస్టమర్లు ముందుగా తమకు సమీపంలోని స్టోర్‌ను ఎంచుకుని ఎల్‌జీ వెబ్‌సైట్‌ (https://www.lg.com/in/tryandbuy-mobile/register)లో తమ పేరు, కాంటాక్ట్‌ వివరాలను నమోదు చేసి రిక్వెస్ట్‌ పంపాలి. దీంతో యూజర్‌కు ఒక ప్రమోషన్‌ కోడ్‌ ఎస్‌ఎంఎస్‌ రూపంలో అందుతుంది. తరువాత స్టోర్‌ వద్ద ఓ ఫాంను ఫిల్‌ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం క్రెడిట్‌ కార్డుతో రూ.99 రీఫండబుల్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ను చెల్లించాలి. తరువాత జీ8ఎక్స్‌ థిన్‌క్యూ ఫోన్‌ను అందజేస్తారు.

ఇక 7 రోజుల పాటు వినియోగదారులు ఆ ఫోన్‌ను వాడుకోవచ్చు. తరువాత ఫోన్‌ కావాలనుకుంటే బ్యాలెన్స్‌ మొత్తాన్ని చెల్లించవచ్చు. లేదా ఫోన్‌ను రిటర్న్‌ చేయవచ్చు. ఫోన్‌ను వెనక్కి ఇచ్చేసే పక్షంలో ఫోన్‌ ఎలాంటి డ్యామేజ్‌ అయి ఉండకూడదు. అలాగే ఫోన్‌కు ఇచ్చిన బాక్స్‌, అందులో ఉండే యాక్ససరీలను కూడా యథావిధిగా రిటర్న్‌ ఇవ్వాలి. ఒక వేళ ఏ పార్ట్‌ మిస్సయినా, లేదా ఫోన్‌ డ్యామేజ్‌ అయినా.. వినియోగదారులు ఆ మేర చార్జిలను భరించాల్సి ఉంటుంది.

ఇక ఎల్‌జీ జీ8ఎక్స్‌ థిన్‌క్యూ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి రూ.15,499 విలువైన జాబ్రా ఎలైట్‌ 65టి ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ను కేవలం రూ.1,999కే అందివ్వనున్నారు. ఇక ఈ ఫోన్‌లో.. 6.4 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఫుల్‌ విజన్‌ ఓలెడ్‌ డిస్‌ప్లే, ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 10.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌ ధర రూ.49,999గా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version