చంద్రబాబుని నమ్మడం లేదు… సీనియర్ల కీలక వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రభుత్వం దూకుడు తెలుగుదేశం పార్టీకి బాగా ఇబ్బందిగా మారిన సంగతి తెలిసిందే. ఏ విధంగా అయినా సరే జగన్ సర్కార్ ని ఎదుర్కోవాలి అని భావిస్తున్న తెలుగుదేశం పార్టీకి అది సాధ్యం కావడం లేదు. అయితే ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు పార్టీ భవిష్యత్తు కి బాగా ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు విషయంలో పార్టీ నేతలు అంత నమ్మకంగా ఆలేరు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. చంద్రబాబు ని ఇప్పుడు ఎవరూ కూడా నమ్మడం లేదని సమాచారం.

అవును కీలక నేతలు ఆరుగురు అయితే తమకు సన్నిహితంగా ఉన్న నేతల వద్ద కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. తమకు ఆసలు ఇప్పుడు పార్టీ బలపడే అవకాశం ఉంది అనే దాని మీద ఏ మాత్రం కూడా నమ్మకం లేదని కేంద్రం నుంచి సహకారం చాలా అవసరం అని అక్కడి నుంచి అది వచ్చే పరిస్థితి ఏ విధంగా అకుడా లేదు అని చెప్పారట. చంద్రబాబు చేతిలో ప్రస్తుత పరిస్థితిలో చేసేది ఏమీ లేదని జగన్ కి కేంద్రం నుంచి ఏ విధంగా సహాయ సహకారాలు అందుతున్నాయి అనేది మున్ముందు తెలుస్తుందని అన్నారట.

జగన్ ని ఎదుర్కోవడం ప్రస్తుతం పరిస్థితుల్లో చంద్రబాబుకి సాద్యం కాదని పార్టీలో అందరూ కూడా సీనియర్ నేతలే ఉన్నారు అని యువ నేతలు అందరూ కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే కొంత మంది ఎమ్మెల్యేలు జగన్ కి జై కొట్టే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. కొన్ని కొన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు వినడం లేదని అది పార్టీకి చాలా ఇబ్బందిగా మారింది అని వాళ్ళు వాపోయినట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version