లోక్‌సభ జీరో అవర్లో ధాన్యం కొనుగోలు అంశంపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్బంగా…. వరి ధాన్యం సేకరణ అంశాన్ని లేవనెత్తారు. ఖరీఫ్ దిగుబడి ధాన్యాన్ని తక్షణమే మార్కెట్ నుంచి సేకరించాలని డిమాండ్ చేశారు. యాసంగిలో వరి సాగుపై కేంద్రం ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దని డిమాండ్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
మార్కెట్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనాలని ఇక్కడ ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలు వెనక్కి వెళ్లి వారి ముఖ్యమంత్రి కేసీఆర్ కి చెప్పాలని చురకలు అంటించారు. టీఆర్‌ఎస్ వాళ్లు కనీసం గోనె సంచులు కొనలేదని… రవాణా కాంట్రాక్టర్లను నిర్ణయించలేదని ఆగ్రహించారు. తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం సేకరణలో విఫలమైందని మండిపడ్డారు. పార్లమెంట్ లో నిరసనలు గాకుండా, వెంటనే టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీలు.. రాష్ట్రానికి వెళ్లి రైతుల నుంచి కనీస మద్దతు ధరకు… ఖరీఫ్ సీజన్ లో పండిన వరిధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.