Mosque Row: జ్ఞానవాపీ, మథుర షాషీ ఈద్గా తరువాత వివాదంలో మరో మసీదు

-

దేశంలో వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు, మథురలోని మథుర షాషీ ఈద్గా మసీదులు ప్రస్తుతం వివాదంలో ఉన్నాయి. వీటి చుట్టూ ఇటీవల జరిగిన పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇప్పటికే జ్ఞానవాపీ మసీదులో వారణాసి కోర్ట్ వీడియో సర్వేకు ఆదేశించింది… ఈ సర్వేలో మసీదులోని ‘ వజూఖానా’లోని ఓ కొలనులో శివలింగం బయటపడిందనే వార్త దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో ఈ కేసు సుప్రీం కోర్ట్ కు చేరింది. తాజాగా సుప్రీం కోర్టు వారణాసి జిల్లా కోర్ట్ కు కేసును బదిలీ చేసింది. ఇదిలా ఉంటే మథుర శ్రీ క్రిష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా మసీదు వార్తల్లో నిలిచింది. ఈ కేసును విచారించేందుకు మథుర కోర్ట్ సిద్ధం అయింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం జ్ఞానవాపీ, మథుర షాషీ ఈద్గా తరువాత మరో మసీదు వివాదంలో చిక్కుకుంది. ఉత్తర్ ప్రదేశ్ లక్నోలోని ‘ టీలే వాలీ మసీదు’ వివాదంలో చిక్కుకుంది. ఈ మసీదు లక్ష్మణుడికి చెందినదని పలు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆదివారం మసీదు వరకు ర్యాలీ చేపట్టింది హిందూ మహసభ అక్కడ హనుమాన్ చాలీసా పఠనం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ మార్చ్ ను పోలీసులు అడ్డుకుని హిందూ మహాసభ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రిషి త్రివేదిని అదుపులోకి తీసుకున్నారు. టీలే వాలీ మసీదును 16 వశతాబ్ధంలో నిర్మించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version