వచ్చే జనవరి 22న అయోధ్యలో రామాలయనికి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయానికి దగ్గర్లోని 100 కోసి పరిధిలలో మద్యపానం నిషేధం చేస్తున్నట్లు వెల్లడించింది. అయోధ్య రామ మందిర క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్ మీడియాతో మాట్లాడిన తర్వాత ఉత్తర ప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి నితిన్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. 84 కోసి పరిక్రమ మార్గము నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ పైజామాబాద్ జిల్లాను అయోధ్యగా మార్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోని యోగి దర్శనీయులు ,సాధువుల పవిత్రతను కాపాడడానికి మద్యంతోపాటు మాంసాహారాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు.
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 2022 జూన్ లో అయోధ్య, మథుర ఆలయాల్లో మద్యపాన నిషేధం విధించింది. అయోధ్యలోని రామ జన్మభూమి, మథురలోని కృష్ణ జన్మభూమి రెండు ప్రదేశాలలోనూ మద్యపానం నిషేధం అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.