వరద ప్రవాహానికి కొట్టుకొని పోతున్న ఆ వ్యక్తిని గమనించిన లైఫ్ జాకెట్ వేసుకొని ఉన్న పోలీస్.. ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే నదిలోకి దూకి ఆ వ్యక్తిని కాపాడాడు. ఒక్క నిమిషం ఆలస్యమైనా.. ఆ వ్యక్తి ప్రాణాలు నదిలో కలిసిపోయేవే.
ఎవరికైనా ప్రాణం అంటే తీపే. తమ ప్రాణాల మీదికి వచ్చేలా ఎవరూ సాహసం చేయరు. తమ ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదంటారు. కానీ.. ఈ పోలీసు మాత్రం తన ప్రాణాన్ని కూడా లెక్కచేయలేదు. గంగా నదిలో కొట్టుకు పోతున్న ఓ వ్యక్తిని ప్రాణాలకు తెగించి కాపాడి హీరో అయ్యాడు.
ఈ ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకున్నది. కంగ్రా ఘాట్ లో స్నానం చేయడానికి వెళ్లిన ఓ భక్తుడు అదుపు తప్పి నదిలో పడిపోయాడు. అదే సమయంలో నదిలో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వరద ప్రవాహానికి కొట్టుకొని పోతున్న ఆ వ్యక్తిని గమనించిన లైఫ్ జాకెట్ వేసుకొని ఉన్న పోలీస్.. ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే నదిలోకి దూకి ఆ వ్యక్తిని కాపాడాడు. ఒక్క నిమిషం ఆలస్యమైనా.. ఆ వ్యక్తి ప్రాణాలు నదిలో కలిసిపోయేవే. సమయానికి దేవుడిలా వచ్చి ఆ వ్యక్తిని కాపాడిన పోలీసును అక్కడి స్థానికులు, నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. పోలీస్.. ఆ వ్యక్తిని కాపాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గంగా నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్ లో ప్రస్తుతం కన్వార్ యాత్ర జరుగుతోంది. ఆ యాత్రకు వచ్చిన భక్తులు స్నానం చేయడానికి గంగానదిలో దిగి… ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా.. ముందే పోలీస్, డిజాస్టర్ టీమ్ ను అక్కడ ఏర్పాటు చేశారు.
हरियाणा निवासी विशाल #haridwar स्थित कांगड़ा घाट पर नहाने गया था। तभी उसका पैर फिसला और वह गंगा के तेज बहाव में बहने लगा है। इसी दौरान वहां मौजूद #UttarakhandPolice के जवान #सन्नी की नजर उस पर पड़ी। सन्नी ने तत्काल गंगा में कूदकर युवक को कड़ी मशक्कत के बाद सकुशल बचा लिया। pic.twitter.com/g1qhBYKhlF
— Uttarakhand Police (@uttarakhandcops) July 20, 2019
People needs to see this. Well done Uttarakhand police. #JaiHind #Jaibharat https://t.co/69EGnQqCgC
— Dr Himanshu Dixit (@DrHimanshuDixi3) July 21, 2019
Salute to you…
— Subodhh (@subodhh9879) July 21, 2019