ఉత్తరాంధ్ర పాలిటిక్స్: వైసీపీకి టీడీపీ-జనసేన కౌంటర్ ఎటాక్.!

-

ఉత్తరాంధ్ర వేదికగా రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఎప్పుడైతే అమరావతి రైతులు శ్రీకాకుళంలోని అరసవెల్లి వరకు పాదయాత్ర మొదలుపెట్టారో అప్పటినుంచి..విశాఖ రాజధాని అని, ఉత్తరాంధ్ర అభివృద్ధి అని చెప్పి వైసీపీ పోరాటం మొదలుపెట్టింది. ఇప్పటికే ఓ జే‌ఏ‌సి కూడా ఏర్పాటు చేసుకుని..ఉత్తరాంధ్రలో రాజధాని సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే టీడీపీ అమరావతికి మద్ధతు ఇస్తూ ఉత్తరాంధ్రకు ద్రోహం చేస్తుందని వైసీపీ విమర్శిస్తుంది.

అయితే ఇంతవరకు పూర్తి స్థాయిలో టీడీపీ..వైసీపీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఆ మధ్య అచ్చెన్నాయుడు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి..ఉత్తరాంధ్రలో వైసీపీ దోపిడి, అమరావతికి మద్ధతుగా మాట్లాడుతూ వైసీపీకి కౌంటర్లు ఇచ్చారు. కానీ వైసీపీ మాదిరిగా ఓ పోరాట పంథాని ఎంచుకోలేదు. వైసీపీ మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానులు అంటుంటే..టీడీపీ మాత్రం ఎందుకు అమరావతి ఒకటే రాజధానిగా ఉంటే బాగుంటుంది..మూడు రాజధానుల కాదు..మూడు ప్రాంతాల అభివృద్ధి కావాలని టీడీపీ గట్టిగా చెప్పలేకపోతుంది.

అయితే వైసీపీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ గట్టి కౌంటర్లు ఇస్తూ వచ్చారు. మూడు రాజధానుల పేరిట రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, ఆనాడు అమరావతికి మద్ధతు తెలిపి..ఇప్పుడు మూడు రాజధానులతో నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. అలాగే విశాఖ వేదికగా పవన్ తన గళం గట్టిగా విప్పాలని అనుకుంటున్నారు. ఈ నెల 15న వైసీపీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన కార్యక్రమం జరగనుంది. అదే సమయంలో పవన్ విశాఖకు రానున్నారు. అక్కడే జనవాణి కార్యక్రమం పెట్టనున్నారు.

అటు టీడీపీ సైతం అదే రోజు…ఉత్తరాంధ్రకు చెందిన మూడు జిల్లాల నేతలు సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. అమరావతి రాజధానిగా టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలకు వివరించాలని భావిస్తున్నారు. విశాఖపట్టణాన్ని ఇప్పటికే ఐటీ, పారిశ్రామికంగా తీర్చిదిద్దిన విషయాన్ని ప్రజలకు వివరించాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. అంటే ఈ నెల 15న విశాఖలో పెద్ద రచ్చే నడవనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version