ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ పట్టణంలో క్లౌడ్ బరస్ట్ దాటికి కొండ చరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. భారీ వరద ప్రవాహం వల్ల వందలాది ఇళ్లు నీటిమట్టం అయ్యాయి. ప్రజలు భయంతో వారి ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

అధికారులు సహాయక చర్యలను చేపట్టారు. ఆస్తి, ప్రాణ నష్టాలు భారీగానే జరిగినట్టుగా తెలుస్తోంది. కొంతమంది వారి ప్రాణాలను కూడా కోల్పోయినట్లుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అధికారులు సహాయక చర్యలను చేపట్టి కొండ చరియ ప్రాంతాలలో ఉన్న వారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఉత్తరాఖండ్‌లో భారీ వరదల కారణంగా కొట్టుకుపోయిన ఇళ్లు.. 50 మంది గల్లంతు
ఉత్తరకాశీ జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న ఖీర్ గంగా నది.. గ్రామాన్ని ముంచెత్తిన వరదలు
శిథిలాల కింద చిక్కుకున్న పలువురు
కొనసాగుతున్న సహాయక చర్యలు pic.twitter.com/w4KMRqgubB— Telugu Scribe (@TeluguScribe) August 5, 2025