జీవితం లో ముఖ్యమైన ఆఖరి భాగం మనిషి చనిపోవడం. కానీ చనిపోయే చివరి క్షణం వరకు మెదడు పనిచేస్తూ ఉంటుంది. మనిషి చనిపోయిన తర్వాత మెదడు పనిచేయడం ఆగిపోతుందని అందరూ భావిస్తారు. కానీ ఇటీవల పరిశోధనలు మరణం తర్వాత కూడా మెదడు కొంత సమయం వరకు పని చేస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై శాస్త్రవేత్తలు ఇంకా పూర్తి సమాచారం సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. కానీ కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి అవి ఏంటి అన్నది మనము చూద్దాం..
మరణం అనేది శరీరంలో జీవక్రియలు ఆగిపోయే స్థితి గుండె ఆగిపోయినప్పుడు రక్తప్రసన్న ఆగిపోతుంది దాంతో మెదడుకు ఆక్సిజన్, సరఫరా ఉండదు ఈ పరిస్థితిలో మెదడు కణాలు సాధారణంగా కొన్ని నిమిషాలు తర్వాత పనిచేయడం మానేస్తాయి. అయితే 2018లో జరిగిన ఒక అధ్యయనంలో శాస్త్రవేత్తలు కొన్ని జంతువుల మెదడు కణాలు మరణం తర్వాత కూడా కొన్ని గంటలపాటు కొంత సేపు పని చేసినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో జంతువుల మెదడు శరీరం నుండి వేరు చేసి ఆక్సిజన్ పోషకాలతో కూడిన ఒక ప్రత్యేక ద్రవంలో ఉంచారు, మెదడు కణాలు తిరిగి కొంతసేపు పనిచేయడం చూపించాయి.
ఇక ఇలా శాస్త్రవేత్తలు చెప్పినట్టు మెదడు అయితే కొన్ని నిముషాలు పనిచేస్తుంది కానీ, చనిపోయిన తర్వాత స్పృహ గాని ఆలోచన గాని ఏదీ ఉండదు. మెదడు కణాలు కొన్ని రసాయనిక చర్యలు కొనసాగిస్తాయి అంతే కానీ సాధారణ పనితీరుకు ఇది సమానం కాదు. చనిపోకముందు మన శరీరంలో జీవక్రియ ఉన్నప్పుడు చనిపోయే చివరి క్షణం వరకు మనిషి ఎన్నో ఆలోచిస్తాడు. తన జీవితం కళ్ళ ముందు మెరుస్తుంది. ఆ టైంలో తనకి దగ్గరగా ఉన్న వాళ్ల గురించి, తనకి కావాల్సిన వారి గురించి, ఎదురుగా ఉన్న వారి గురించైనా కావచ్చు, ఇలా మెదడు అనేక విషయాలపైన ఆలోచిస్తూ ఉంటుంది కానీ మనిషి చనిపోయిన తరువాత ఇక అలాంటి ఆలోచనలు అనేది ఉండవు. మెదడు కొంత టైం వరకు పనిచేసిన, సృహ, ఆలోచన అయితే ఉండదు.
మరణం తర్వాత మెదడు పనిచేయడం గురించి ఇంకా అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు ఈ అంశంపై అధ్యయనాలు చేస్తున్నారు ఈ పరిశోధనలు భవిష్యత్తులో అవయవ మార్పిడి న్యూరాలజీ చికిత్సలో కీలక పాత్ర పోషించవచ్చు. మరణం తర్వాత మెదడు కార్యకలాపాల గురించి శాస్త్రవేత్తలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ఇవి మనిషి సృహ, ఆలోచన లేదా తిరిగి బతికించే సామర్థ్యాన్ని మాత్రం చూపించవు. చనిపోయిన తరువాత మెదడు పూర్తిగా ఆగిపోదు కొన్ని నిమిషాల పాటు మెదడులోని నురన్స్ స్పందించే అవకాశం ఉంది. దీన్నే మెదడు మరణానికి ముందు చివరి శక్తిగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తారు.