సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాపై కాంగ్రెస్ నేత, పీసీసీ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కొందరిని పోగుచేయించి, నాపై తప్పుడు అభియోగాలు మోపి, నన్ను ప్రతిరోజు కలెక్టర్ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులు ఇచ్చాడని మండిపడ్డారు.

సందీప్‌కుమార్ ఝా కలెక్టర్‌గా జిల్లా మేజిస్ట్రేట్ స్థాయిలో ఉండి విరోధం, ప్రతీకార భావనతో ఇలా వ్యవహరిస్తూ నాపై దాడి చేస్తున్నాడని ఆగ్రహించారు. నా రాజకీయ జీవితంలో ఎంతోమంది కలెక్టర్లను చూశాను, వారితో కలిసి పని చేశానని గుర్తు చేశారు కాంగ్రెస్ నేత, పీసీసీ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం. కానీ సందీప్‌కుమార్ ఝా విచిత్రమైన వ్యక్తి. ఎన్నిసార్లు ఆయనకు ఫోన్ చేసినా, ఒకసారి రింగ్ అయ్యి కట్ అవుతుందంటూ మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం.