ఈ కాంగ్రెసోళ్లు రేవంత్‌రెడ్డిని వ‌ద‌ల‌రా..!

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెండు అడుగులు ముందుకు సాగుతుంటే.. పది అడుగులు వెనక్కి వ‌స్తోంద‌న్న‌ చందంగా ఉంది. అసలు ఆ పార్టీలో ఎప్పుడు ఎవరు ? ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పటికే వరుసగా రెండు సాధారణ ఎన్నికల్లో ఓటమి… అంటే పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండ‌క‌ తప్పని పరిస్థితి. మరోవైపు అధికార టీఆర్ఎస్ రోజురోజుకు తిరుగులేని శక్తిగా మారుతోంది. టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే పార్టీ అభ్యర్థి 40 వేల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయిన దుస్థితి.

ఇలాంటి పరిస్థితుల్లో కలిసికట్టుగా అధికార పార్టీని ఎదుర్కోవాల్సిన పార్టీ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో ఉన్న కొద్ది మంది నేత‌ల్లోనే ఎవరికి ఎవరుతోనూ పొసిగే పరిస్థితి లేదు. పార్టీలో ఉన్నవాళ్లలో సీఎం కేసీఆర్‌ను, అధికార టీఆర్ఎస్ ను గట్టిగా ఢీకొట్టే రేవంత్‌రెడ్డి దూకుడు మిగిలిన నేతలకు కంటగింపుగా మారింది. ఈ క్రమంలోనే రేవంత్ దూకుడుగా ముందుకు వెళుతుంటే బ్రేకులు వేసే పరిస్థితి.

అసలు వి.హనుమంత రావు లాంటి నేతలతో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు ఎంత ప్రయోజనమో ఆ పార్టీ నేతలకే తెలియాలి. తాజాగా పార్టీ పరిస్థితిపై స‌మీక్ష‌ నిర్వహించేందుకు వ‌చ్చిన గులాం న‌బీ ఆజాద్ స‌మ‌క్షంలోనే సీనియర్ నేత హనుమంతరావుకు ష‌బ్బీర్ ఆలీ మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆర్ఎస్ఎస్ భావ‌జాలం ఉన్న వాళ్ల‌ను వెంటేసుకుని మీరు తిరుగుతున్నారంటూ ఆజాద్‌ను విమ‌ర్శించిన వీహెచ్‌, సీనియ‌ర్ల‌ను శ‌వాళ్ల‌ను అన్నారంటూ ప‌రోక్షంగా ష‌బ్బీర్‌పై విరుచుకుప‌డ్డారు.

ఇక తాను ఎవ్వ‌రిని అలా అన‌లేదన్న ష‌బ్బీర్ వీహెచ్ వ్యాఖ్య‌ల‌పై స్పందించాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఇద్దరి మధ్య వివాదం పెద్దగా మారుతున్నట్టు గమనించిన ఆజాద్… ఇద్దరికీ సర్ధిచెప్పారు. ఏదేమైన రేవంత్‌ను కొద్ది రోజులుగా టార్గెట్ చేస్తోన్న వీహెచ్‌కు అంత‌కు మించిన ప‌నేం లేన‌ట్టుగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version