గుడ్ న్యూస్‌: దిగొచ్చిన బంగారం ధ‌ర‌..

-

ప‌సిడి ప్రేమికుల‌కు గుడ్ న్యూస్‌. దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో 05.11.2019 మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.101 తగ్గింది. దీంతో బంగారం ధర 10గ్రాములకు గాను రూ.39,213గా పలుకుతోంది. అదే సమయంలో హైదరాబాద్ లో బంగారం ధర 10 గ్రాములకు గానూ రూ. 39870గా నమోదైంది. కాగా అంతర్జాతీయంగా బంగారం మార్కెట్ క్షీణించడంతోపాటు రూపాయి విలువ బలపడటం కూడా సానుకూలంశంగా మారింది.

అలాగే న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1500 డాలర్లుగా ఉంది. దీంతో దేశీయంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే దసరా, దీపావళి లాంటి ఫెస్టివల్స్ పూర్తి అయినప్పటికీ వివాహాలు సీజన్ ఇంకా ఉండటంతో పసిడి ప్రేమికులు బంగారం కొనేందుకు ఇష్టపడుతుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని బంగారం దుకాణా దారులు ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version