Realme నుంచి V20 5G బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్..!ఫీచర్స్‌ అదుర్స్‌..!

-

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ తనదైన శైలిలో బడ్జెట్‌ ఫోన్లను లాంచ్‌ చేస్తుంది. తాజాగా రియల్‌మీ వీ20 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను చైనాలో లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ ఫీచర్స్‌, ధర వివరాలు ఇలా ఉన్నాయి..

రియల్‌మీ వీ20 5జీ ధర..

ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది.
4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధర 999 యువాన్లుగా (సుమారు రూ.11,600) నిర్ణయించారు.
స్టార్ బ్లూ, ఇంక్ క్లౌడ్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

రియల్‌మీ వీ20 5జీ స్పెసిఫికేషన్లు..

ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు.
మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించలేదు.
ఇది ఫేస్ అన్‌లాక్‌ను సపోర్ట్ చేసే అవకాశం ఉంది.
వైఫై, బ్లూటూత్, 5జీ, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

కెమెరా క్వాలిటీ, బ్యాటరీ సామర్ధ్యం..

ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 0.3 మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా… 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version