16 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చని హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పంజాబ్ హర్యానా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఒక ముస్లిం అమ్మాయి కి 16 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆమె ఇష్టానుసారంగా వివాహం చేసుకోవచ్చని స్పష్టంచేసింది హై కోర్టు.
21 సంవత్సరాల అబ్బాయి మరియు 16 సంవత్సరాల అమ్మాయి ఇటీవల పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రుల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఈ జంట తాజాగా హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే పంజాబ్ హర్యానా హైకోర్టు ఈ కేసును విచారించింది.
ఈ కేసు విచారణలో కీలక తీర్పు ఇచ్చింది. 16 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చని ఈ సందర్భంగా హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అయితే.. ఈ తీర్పు పై సర్వత్రా నిరసన వస్తోంది.