గన్నవరం ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్ దిగజారి మాట్లాడుతున్నారని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. గన్నవరం నియోజకవర్గంలోని హనుమాన్ జంక్షన్ లో వారాహి విజయభేరి బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వివేకం కలిగిన నాయకుడు అని అనుకున్నాడు. పాలసీ పరంగా విబేధాలు ఉంటే మాట్లాడవచ్చు. కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ జనసేనకి, ఎమ్మెల్యే తనకు ఓటు వేయాలని వంశీ కోరుతున్నారట అది సరైంది కాదన్నారు.
వల్లభనేని వంశీ ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి పై అసెంబ్లీలో మాట్లాడటం తనకు బాధ కలిగించిందన్నారు పవన్. వంశీకి జనసేన ఓట్లు వేస్తే.. స్త్రీని అగౌరవపరిచే వారిని ప్రోత్సహించడం అవుతుందన్నారు. మరో నాలుగు రోజుల్లో ఏపీలో ఎన్నికలున్నాయి. రాష్ట్ర, దిశ, భవిష్యత్ నిర్ణయం చేసే ఎన్నికలు ఇవి. ఆలోచించి ఓటు వేయాలని సూచించారు పవన్ కళ్యాణ్. ఆత్మగౌరవం తాకట్టు పెట్టలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలు బయటికి వస్తున్నారని వ్యాఖ్యానించారు. బాలశౌరి, యార్లగడ్డ వంటి వారు ఇందకు ఉదాహరణ అన్నారు.