పాల్వంచ రామకృష్ణ ఆత్మహత్య పై వనమా రాఘవ క్లారిటీ ఇచ్చారు. రామకృష్ణ కుటుంభం ఆస్తి వివాదం గురించి..మమ్మల్ని ఆశ్రయించారని.. వారి ఇష్టపూర్థీగా ఒప్పందాలు చేసుకున్నారని పేర్కొన్నారు.. స్థానిక ఎమ్మెల్యే కుటుంబం వద్దకు రామకృష్ణ కుటుంభం రావడం తప్పా ? కొత్తగూడ నియోజకవర్గం లో మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అగ్రహించారు.
పోలీస్ ల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్త..కాయలున్న చెట్టుకే రాళ్ళు వేస్తారు..ఇదే ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్నదని మండిపడ్డారు. నేను ఎలాంటి భూకబ్జాలు, సెటిల్ మెంట్లకు పాల్పడలేదు..రామకృష్ణ ఆత్మహత్య విషయంలో పార్టీ అధిష్టానం వివరణ కోరలేదని పేర్కొన్నారు.. వివరణ అడిగితే నేను తప్పకుండా చెబుతానని.. ఎమ్మెల్యే వీరయ్య నన్ను కాల్చాలని అన్నారు.. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చురకలు అంటించారు.
నిజాలు తెలియకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం మంచిది కాదు..గతం లో జరిగిన మరో ఆత్మహత్య కేసులో..నాపై ఆధారాలు ఎందుకు రుజువు చేయలేకపోయారని ప్రశ్నించారు..నేను సాధారణ పార్టీ కార్యకర్తను..వనమా రాఘవ రాజకీయ ఎదుగుదల చూడలేకనే.. ఈ ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కొత్తగూడెం ప్రజలకు త్వరలోనే నిజాలు తెలుస్తాయని తెలిపారు.