డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో భద్రతా లోపంపై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో నకిలీ ఐపీఎల్ కలకలం రేపాడు. అయితే… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో భద్రతా లోపంపై హోంమంత్రి ఫైర్ కావడం జరిగింది. వై కేటగిరీ భద్రతలో ఉన్న పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగారు బలివాడ సూర్యప్రకాశరావు.
ఐపీఎస్ యూనిఫాంలో ఉన్న అధికారికి సెల్యూట్ కొట్టి, ఫోటోలు దిగారు కొందరు అధికారులు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు హోంమంత్రి వంగలపూడి అనిత. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రత లోపంపై దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు హోం మంత్రి అనిత. దీనిపై విచారణ చేయాలని ఆదేశించారు. కాగా, పార్వతీ పురం మన్యం జిల్లా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఐపీఎస్ యూనిఫారంతో వచ్చిన సూర్య ప్రకాష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు విజయనగరం పోలీసులు.