రోజాకు తన వరకు వచ్చేసరికి ఆడతనం గుర్తుకు వచ్చిందా : వంగలపూడి అనిత

-

తమ పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుటుంబాలపై అసభ్యంగా మాట్లాడిన రోజాకు తనవరకు వచ్చేసరికి ఆడతనం గుర్తుకు వచ్చిందా? అని టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతి, రోజా తప్ప ఇక మహిళలు ఎవరూ లేరా? అని ప్రశ్నించారు. ఆమె బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ… గత అసెంబ్లీలో తన గురించి, పీతల సుజాత గురించి మంత్రి రోజా అసభ్యంగా మాట్లాడారని గుర్తు చేశారు. ఆమె నోటికి వచ్చినట్లు మాట్లాడారని, అప్పుడు తాను, తన పిల్లలు టీవీ, పేపర్ చూసేందుకు కూడా భయపడ్డామన్నారు.

టీడీపీ నేతలు ఏదో అన్నారని రోజా కంట తడిపెట్టారు..ఇలాంటి కంటతడిలు తాము ఎన్నోసార్లు పెట్టామని అన్నారు. వంగలపూడి అనిత బుధవారం మీడియాతో మాట్లాడారు. మరి మగవాళ్ల గురించి రోజా నోటికొచ్చినట్లు మాట్లాడొచ్చా? అని నిలదీశారు. దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా తన గురించి రోజా అసభ్యంగా మాట్లాడారు అని గుర్తు చేశారు. మాజీమంత్రి పీతల సుజాతను బాడీ షేమింగ్ చేసింది రోజా కాదా? అని నిలదీశారు. ఆరోజు ఆడతనం, మహిళ అన్న అంశాలు రోజాకు గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. ఇవాళ రోజా నీతులు మాట్లాడుతుంటే ఏమనుకోవాలి? అని ప్రశ్నించారు. టీడీపీ మహిళా నేతలపై అసభ్యంగా మాట్లాడితే వారిపై కేసులు ఉండవా? మా ఫిర్యాదులపై ఇప్పటివరకు విచారణ జరగలేదు అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version