పసుపు బోర్డు ఏర్పాటు పింకీలు జీర్ణించుకోలేకపోతున్నారు : ఎంపీ అర్వింద్‌

-

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ లో ఇచ్చిన హామీ మేరకు నిజమాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణంయం తీసుకుంది. తెలంగాణలో పసుపు బోర్డు నెలకొల్పనున్నట్లు ప్రకటించారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలను ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి వెల్లడించారు. అలాగే తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పాలమూరు సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ప్రధాని ప్రకటించిన రెండ్రోజులకే గిరిజన వర్సిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ఈ బిల్లుపై నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపింది. ములుగు జిల్లాలో రూ. 900 కోట్లతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ వర్సిటీకి గిరిజనుల ఆరాధ్యదైవమైన సమ్మక్క, సారక్క పేర్లను పెట్టారు. ఏపీ, తెలంగాణ కృష్ణా జలాల వివాదంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణ వాటాలు తేల్చాలని ట్రైబ్యునల్ కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధనలు రూపొందించాలని ట్రైబ్యునల్ ను కేంద్రం ఆదేశించింది. కృష్ణా జలాల్లో తమ వాటా తేల్చాలని తెలంగాణ కోరుతున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

పసుపు బోర్డు ఏర్పాటుతో పింకీలు జీర్ణించుకోలేకపోతున్నారంటూ మండిపడ్డారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్రం నోటిఫికేషన్ కూడా విడుదల చేసిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదన్నారు. గత ఎన్నికల్లో పసుపు రైతులు తనకు ఓట్లు వేయలేదని, వారికి వారే వేసుకున్నారని, ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తుండడంతో ఈసారి జరిగే ఎలక్షన్స్ లో తమకే ఓట్లు వేస్తారని చెప్పారు.
గతేడాది 1600 కోట్ల రూపాయల పసుపు ఎగుమతి జరిగిందని, ఈ ఏడాది 8 వేల 400 కోట్ల రూపాయలకు పెంచాలనే టార్గెట్ ప్రధాని మోదీ ఇచ్చారని చెప్పారు. 15 రోజుల నుంచి ముఖ్యమంత్రి గురించి ఎవరికీ తెలియడం లేదన్నారు. సీఎం కేసీఆర్ కనబడటం లేదు.. ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కేసీఆర్ హెల్త్ బులిటెన్ వచ్చిందా..? అని ప్రశ్నించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version