Breaking : జాతీయ మహిళ కమిషనుకు వంగలపూడి అనిత లేఖ

-

ఇటీవల వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో అంటూ ఓ వీడియో వైరలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఈ వీడియోపై క్లారిటీ ఇచ్చారు. తాజాగా.. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఎపిసోడ్ సహా ఏపీలో పెద్ద ఎత్తున మహిళలపై వేధింపులు, దాడులు జరుగుతున్నాయని జాతీయ మహిళ కమిషన్‌కు టీడీపీ మహిళ నాయకురాలు వంగలపూడి అనిత లేఖ రాశారు. ఆ లేఖలో.. ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియోపై జాతీయ మహిళ కమిషన్ విచారణ జరపాలని అనిత కోరారు. మహిళలపై వేధింపులను అరికట్టడంలో ప్రభుత్వం ఉదాసీనంగా ఉందంటూ లేఖలో స్పష్టం చేసిన అనిత.. బాధిత మహిళల వివరాలను లేఖకు జత చేసి మహిళా కమిషన్ చైర్ పర్సన్‌కు పంపారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై అఘాత్యాలు.. దాడులు పెరిగాయి. ఏపీలోని మహిళలు అభద్రత, ప్రాణ, మాన భయంతో బతుకుతున్నారు. జూన్ 2019 నుంచి జూలై 2022 వరకు సుమారుగా 777 మహిళలపై అఘాయిత్యాలు, దాడులు జరిగాయి. ఏపీ ప్రభుత్వం దిశా చట్టం పేరుతో మహిళలను మోసం చేస్తోంది.

దిశా చట్టం ఒక అపోహ మాత్రమే, అలాంటి చట్టమే లేదు. మహిళలపై జరుగుతున్న నేరాల్లో వైసీపీ నేతలే ఎక్కువగా ఉన్నారు. వైసీపీ నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు మహిళా ప్రభుత్వ ఉద్యోగులను, ఇతర మహిళలను బెదిరిస్తున్నారు. ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో ఎపిసోడ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాము ఎన్నుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలాంటి వారా..? అని ప్రజలు బాధ పడుతున్నారు. ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియోపై ఎలాంటి విచారణ జరపకుండా పోలీసులు మాధవ్ కు క్లీన్ చిట్ ఇచ్చారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఫేక్, మార్ఫింగ్ చేసిన వీడియో అని అనంత ఎస్పీ ఫకీరప్ప చెప్పడం విస్మయం కలిగిస్తోంది. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా ఎంపీ మాధవ్ వీడియో క్లిప్‌పై జాతీయ మహిళా కమిషన్ విచారణ జరపాలి. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి అధికార వైసీపీ నేతలను కాపాడేందుకు కొందరు పోలీసులు ప్రయత్నిస్తున్నారు అని ఆమె లేఖలో మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version