Breaking : విద్యార్థులకు శుభవార్త.. రేపు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు

-

తెలంగాణలోని ఎంసెట్‌ అభ్యర్థులకు విద్యా శాఖ శుభవార్త చెప్పింది. తెలంగాణ ఇంజనీరింగ్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫలితాలు శుక్రవారం విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఫలితాలు విడుదల చేసేందుకు ఆధాకారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం జేఎన్‌టీయూహెచ్‌లో ఎంసెట్‌ కమిటీ సమావేశం జరిగింది. అయితే.. ఈ సమావేశంలోనే ఫలితాల వెల్లడి తేదీని అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ ఏడాది జులై 18 నుంచి 21 వరకు జరిగిన తెలంగాణ ఎంసెట్‌ 2022 ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షకు 1.56 లక్షలు, అలాగే జులై 30, 31 తేదీల్లో జరిగిన అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌ పరీక్షకు 80 వేల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించి ప్రైమరీ ఆన్సర్‌ కీని కూడా ఇప్పటికే విడుదల చేసి విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించే ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరిగింది.

ఫైనల్‌ ఆన్సర్‌ ‘కీ’తో పాటు ఫలితాల విడుదలకు కూడా తెలంగాణ ఎంసెట్ కమిటీ విశ్లేషించి నిర్ణయం తీసుకోనుంది. అనంతరం విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదగా ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సారి బీఎస్సీ నర్సింగ్‌ సీట్లను కూడా ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ర్యాంకుల ఆధారంగానే కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. ఫలితాలు ప్రకటించిన అనంతరం విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ https://eamcet.tsche.ac.in/ లో రిజల్ట్స్‌ చెక్ చేసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version