కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన వనిందు హసరంగ

-

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ లో శ్రీలంక గ్రూప్ స్టేజి లోని ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్‌ వనిందు హసరంగ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు.జట్టులో సాధారణ సభ్యుడిగా కొనసాగుతానని హసరంగ వెల్లడించాడు. హసరంగ గతేడాదే శ్రీలంక టీ20 జట్టు సారధిగా ఎంపికయ్యాడు.లంక జట్టు సారథిగా కేవలం పది మ్యాచ్‌ల్లో మాత్రమే వ్యవహరించాడు. టీ20 వరల్డ్‌కప్‌ 2024లో హసరంగ సారథ్యంలో శ్రీలంక 4 మ్యాచ్‌ల్లో కేవలం ఒ‍కే ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది.

శ్రీలంక టీ20 జట్టు కొత్త సారథిని ప్రకటించాల్సి ఉంది.ఇదిలా ఉంటే, ఈ నెలాఖరులో టీమిండియా శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటలో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు సిరీస్‌లకు వేదికలు ఇంకా ఖరారు కాలేదు. జులై 27, 28, 30 తేదీల్లో టీ20 మ్యాచ్ లు.. ఆగస్ట్‌ 2, 4, 7 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌ల కోసం ఇరుదేశాలు జట్లను ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం ఇండియా.. జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతుండగా.. శ్రీలంక ప్లేయర్లు లంక ప్రీమియర్‌ లీగ్‌తో బిజీగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news