పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన వర్ష బొల్లమ్మ..!

-

వర్ష బొల్లమ్మ.. తాజాగా స్వాతిముత్యం సినిమాతో తన ఖాతాలో మరో సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్ , మలయాళం సినిమాలలో నటించి ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా పెళ్లి పీటలు ఎక్కబోతోందని.. అది కూడా ఒక బడా నిర్మాత కొడుకుతో వర్ష బొల్లమ్మ పెళ్లి ఖాయమయిందని.. త్వరలోనే నిశ్చితార్థం కూడా చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి . అయితే సోషల్ మీడియాలో తన పెళ్లి వార్తలపై స్పందించిన వర్ష బొల్లమ్మ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

పెళ్లి వార్తల గురించి ప్రచారంలోకి వచ్చిన కొన్ని న్యూస్ లింక్స్ ను ఆమె షేర్ చేసి.. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు అని స్పష్టం చేసింది . “పెళ్లిచూపులు చూసి.. అబ్బాయిని సెలెక్ట్ చేసినందుకు.. ధన్యవాదాలు ..” అంటూ తన గురించి వచ్చిన వార్తలపై సెటైర్లు వేసింది. అంతేకాదు” అబ్బాయి ఎవరో చెబితే.. నేను కూడా సంతోషపడతాను.. మా ఇంటి వాళ్లకు పరిచయం చేస్తాను..” అంటూ ఆమె తెలిపింది.. అంతేకాదు ప్రస్తుతానికి నా పెళ్లి చూపులు మీరు చూడాలంటే ఆహా ఓటీటీ లోని స్వాతిముత్యం సినిమాలో చూడండి అంటూ కూడా వర్ష వెల్లడించింది. కావాలని ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ కూడా ఫైర్ అయింది వర్ష బొల్లమ్మ.

మొత్తానికి తన పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా ఆ ప్రాజెక్టులపై మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి.. తన పెళ్లి వార్తలపై క్లారిటీ ఇవ్వడంతో అభిమానుల సైతం స్టార్ హీరోలకు జోడిగా నటించి మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం కెరియర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ ముద్దుగుమ్మ పరిమితంగానే పారితోషకం డిమాండ్ చేస్తుంది. అందుకే వరుస ఆఫర్లు కూడా అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఏది ఏమైనా ఈమె స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్తుందో లేదో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version