వాస్తు: మనీ ప్లాంట్ ని ముఖద్వారం వద్ద ఉంచద్దు..!

-

వాస్తు ప్రకారం అనుసరిస్తే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి ఆనందంగా ఉండడానికి అవుతుంది. ఈ కారణంగానే చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. వాస్తు దోషాలు ఏమీ లేకుండా చూసుకుంటారు. ఈరోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని పంచుకున్నారు. మరి ఇక వాటి కోసం చూద్దాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ తప్పులను అస్సలు చేయకూడదు. వీటిని చేయకుండా చూసుకుంటే ఆనందంగా ఉండొచ్చు.

మనం చేసే చిన్న చిన్న తప్పులు వలన రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నో రకాల నష్టాలని మనం ఎదుర్కోక తప్పదు. వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఇది ధనాన్ని తీసుకు వస్తుంది. ఇబ్బందుల నుండి గట్టెక్కిస్తుంది. కానీ వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం దగ్గర మనీ ప్లాంట్ ని ఉంచకూడదు. ఇలా చేయడం వలన వచ్చే అదృష్టం మన ఇంటికి రాకుండా మరో ఇంటికి వెళ్లే అవకాశం ఉంది. అలానే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ముళ్ళ మొక్కలు లేకుండా చూసుకోండి.

ఇంట్లో ముళ్ళ మొక్కలు ఉంటే ప్రశాంతత ఉండదు. ఇంట్లో ప్రశాంతత ఆనందం ఉండాలంటే ఇంటి ముఖద్వారం దగ్గర తులసి మొక్క ఉంచండి. రోజూ నీళ్లు పోస్తూ ఉండండి. దీపం పెడుతూ ఉండండి. ఇది పాజిటివ్ ఎనర్జీ ని తీసుకు వస్తుంది. ఇబ్బందుల్ని తొలగిస్తుంది. అలానే వాస్తు శాస్త్రం ప్రకారం మల్లె మొక్కని మీరు ముఖద్వారం దగ్గర నాటొచ్చు. ఇది కూడా పాజిటివ్ ఎనెర్జీని తీసుకు వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version