వాస్తు: ఆర్ధిక బాధలా..? ఈ సింపుల్ టిప్స్ తో బయట పడండి మరి..!

-

ఒక్కొక్కరు ఒక్కొక్క బాధతో ఇబ్బంది పడుతూ ఉంటారు. నిజానికి బాధలు లేకుండా ఆనందంగా ఉండాలంటే చాలా కష్టం. కానీ వాస్తు ప్రకారం అనుసరిస్తే ఆ బాధల నుండి బయటపడొచ్చు. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. మీకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయా..? అయితే పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలని మీరు చూడాల్సిందే. ఈ విధంగా మీరు అనుసరిస్తే సమస్యలు అన్ని పోయి ఆనందంగా ఉండొచ్చు.

వాస్తు శాస్త్రం ప్రకారం వ్యాపార వృద్ధి యంత్రాన్ని, మహాలక్ష్మి యంత్రాన్ని బీరువాలో ఉంచితే చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. ఎంత కష్టపడినా డబ్బులు నిలవక పోతున్నట్లయితే లక్ష్మీ దేవి కి కుబేరుడు కి పూజ చేయండి. రెగ్యులర్ గా వాటికి పూజ చేస్తే ఆర్థిక బాధలు ఉండవు. అలానే రాత్రి పూట చాలా మంది తినేసిన వాటిని సింక్ లోనే వదిలేస్తూ ఉంటారు. తినేసిన వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అంట్ల గిన్నెలని రాత్రి పూట వదిలేస్తే లక్ష్మీ దేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది.

ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వాళ్ళు దక్షిణవర్తి శంఖాన్ని పూజిస్తే ఎంతో మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. ఆర్థిక బాధల నుండి బయట పడేస్తుంది. పూజ చేసిన తర్వాత ఆ పూలని తొలగించాలి పూలు ఎండిపోవడం వలన నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ధనం మీ ఇంట్లో నిలవదు. కాబట్టి వాడిపోయిన పువ్వులని తొలగించాలి. ఈరోజు పూజ చేసిన తర్వాత మరుసటి రోజు కొత్త పూలని పెట్టేటప్పుడు ముందు రోజు పూజ చేసిన పూలని తొలగించాలి ఇలా ఈ చిట్కాలని అనుసరిస్తే ఆర్థిక ఇబ్బందులు నుండి బయటపడొచ్చు. ఇంట్లో ఏ బాధలు వుండవు. ఆనందంగా ఉండచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version