బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణించాలి : పవన్‌

-

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో సత్యకుమార్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వైసీపీ శ్రేణులు ఈ దాడికి పాల్పడ్డాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద సత్యకుమార్ కారుపై రాళ్ల దాడి జరిగింది. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళన నేటికి 1200 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా మందడంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది అమరావతి జేఏసీ. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. మందడంలో రైతుల దీక్షలో సత్యకుమార్ పాల్గొన్నారు. అనంతరం తిరిగి వెళుతుండగా..మూడు రాజధానులకు అనుకూలంగా దీక్ష చేస్తున్న వైసీపీ శ్రేణులు సత్యకుమార్ వాహనంపై రాళ్ల దాడికి దిగాయి. వైసీపీ ఎంపీ నందిగం సురేష్ నేతృత్వంలో మూడు రాజదానులకు అనుకూలంగా దీక్ష చేస్తున్న వాళ్లే ఈ దాడికి పాల్పడినట్టు బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పోలీసులు రంగంలోకి దిగి అక్కడున్న ఇరు వర్గాల వారికి పంపించేశారు.

మరోవైపు బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ వాహనాన్నే ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోవడం వెనుక కుట్ర ఉందని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు. ఇటీవలి కాలలో బీజేపీ అమరావతికి పూర్తి స్థాయిలో ప్రకటిస్తోందని.. అందుకే ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. రాష్ట్రనేతలతో పాటు జాతీయ కార్యదర్శి హోదాలో ఉన్న సత్యకుమార్ కూడా అమరావతికి మద్దతుగా రైతులకు సంఘిభావం చెప్పడానికి వచ్చారు. ఇాలాంటి సమయంలో ఆయనపై దాడి చేయడం ద్వారా కొంతమంది వ్యక్తులు సంచలనం సృష్టించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దాడికి పాల్పడిన వారిని ప్రాథమికంగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరులుగా గుర్తించారు. దాడి చేస్తున్న దృశ్యాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దాడి జరగడం పట్ల స్పందించారు. రాజధాని రైతులకు మద్దతిస్తే దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేత సత్యకుమార్ పై దాడి సరికాదని వెల్లడించారు ఆయన. ఈ దాడి ఘటనను బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణించాలని అన్నారు పవన్. దాడి ఘటనపై కేంద్రం సమగ్ర విచారణ చేపట్టాలని పవన్ తెలిపారు. వైసీపీ దౌర్జన్యాలను కేంద్రం దృష్టికి తీసుకెళతామని వ్యక్తపరిచారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version