వాస్తు: ఈ పూలు ఇంట్లో ఉంటే.. బాధలన్నీ దూరం..!

-

వాస్తు ప్రకారం అనుసరిస్తే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తారు. ఏ సమస్యలు ఉన్నా సరే వాస్తు తో మనం పరిష్కరించుకోవచ్చు. ఎక్కువ మంది ఆనందం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. వివిధ రకాల బాధలు కలుగుతూ ఉంటాయి తరచు ఏదో ఒక బాధ ఉంటూ ఉంటుంది. మీకు కూడా ఏదో ఒక బాధ అలా ఉంటూ ఉందా..? అయితే కచ్చితంగా మీరు పండితులు చెబుతున్న విషయాలను చూడాలి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఈ తప్పులని అస్సలు చేయకుండా. వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకుంటే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. ఇంట్లో ఈ పూలు ఉంటే కచ్చితంగా ఆనందంగా ఉండొచ్చు అని పండితులు అంటున్నారు. మన ఇంట్లో మందారం మొక్క ఉంటే ఎంతో మంచి కలుగుతుంది. ఇది పాజిటివ్ ఎనర్జీ ని ఇస్తుంది. నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది.

మందార పూలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే.. అలానే పసుపు రంగు చామంతి పూలు ఇంట్లో ఉంటే ఆనందం కలుగుతుంది. బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ మొక్కను కూడా నాటడం మంచిది. ఇంట్లో గులాబీ ఉంటే ప్రేమ ఉంటుంది. వాస్తు ప్రకారం గులాబీ కూడా నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. సంపంగి పూలు పారిజాతం పూలు కూడా ఇంట్లో ఉంటే మంచిది. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలని.. మరి వీటిని అనుసరించి ఏ బాధ లేకుండా ఆనందంగా ఉండండి. బాధలన్నీ మర్చిపోయి నవ్వుతు ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version