ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండే సమస్యలను తొలగించుకోవడానికి వాస్తు చిట్కాలు పాటించాలి. వాస్తు చిట్కాలని కనుక పాటిస్తే సమస్య ఏమీ లేకుండా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండొచ్చు. అయితే ఈ రోజు పండితులు కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక ఫాలో అయితే కచ్చితంగా సమస్యల నుండి బయట పడవచ్చు. అయితే మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాలు గురించి ఇప్పుడు చూద్దాం.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇటువంటి గచ్చు ఉంటే మంచిది కాదని.. దీని వల్ల ప్రశాంతత ఉండదని అలానే ఆనందం కూడా ఉండదని పండితులు చెప్తున్నారు. మనం ఇంట్లో వేయించుకునే గచ్చు రంగు కూడా మన మీద ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడూ కూడా రంగుల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అని పండితులు చెప్తున్నారు.
ఉదాహరణకి ఇంట్లో ఉండే గోడలు బాగా ముదురు రంగు అయితే అప్పుడు ఖచ్చితంగా మీ గచ్చు కొంచెం లైట్ కలర్ అయి ఉండాలి. ఇలా రంగులని బ్యాలెన్స్ చేసుకోవాలి. అలా కాకుండా ఇంట్లో అంతా కూడా అన్ని డార్క్ కలర్స్ వేసుకోవడం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది.
ఎప్పుడు కూడా ముదురు రంగులని గచ్చులపై వేయకూడదు. ముదురు రంగు మార్బుల్ టైల్స్ వంటివి ప్రిఫర్ చేయకండి. వీటివల్ల నెగటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. అలానే సంతోషం, శాంతి ఉండకుండా పోతుంది కాబట్టి గచ్చు విషయంలో ఈ మార్పులు చేసుకోవడం మంచిది.