వాస్తు: పసుపుతో ఓటమిని దూరం చేసేయండి..!

-

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. వాస్తు ని అనుసరించడం వలన ఏ బాధ ఉండదు. పైగా నష్టాలు అన్నీ కూడా తొలగి పోతాయి చాలా మంది గెలుపొందాలని గెలవడం కోసం చూస్తూ ఉంటారు. కానీ ఓటమి తప్పదు. ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మరి ఓటమికి దూరంగా ఎలా ఉండాలి..? ఎలా గెలవాలి అనే విషయాన్ని ఈరోజు మనకి వాస్తు పండితులు చెప్పారు మరి వాటి కోసం ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఒకవేళ కనుక మీరు మీ కెరియర్ లో కానీ వ్యాపారంలో కానీ ఏదైనా ఇబ్బందులతో సతమతమవుతుంటే మీరు స్నానం చేసేటప్పుడు ఆ నీళ్లలో కొంచెం పసుపు వేసుకోండి ఇది మీ గురు దోషాన్ని తొలగిస్తుంది, మీ కెరియర్ బాగుంటుంది అనుకున్నట్లుగా మీరు సక్సెస్ ని పొందవచ్చు.
మీరు కనుక ఒకవేళ పెళ్లి అవ్వక ఇబ్బంది పడుతున్నట్లయితే గౌరీదేవికి పసుపుని ఇవ్వండి లేదంటే పసుపు కొమ్ములని ఇవ్వచ్చు.
లక్ష్మీవారం పూట విష్ణుమూర్తి లక్ష్మీదేవిని మీరు పూజిస్తే కూడా సమస్యలు తొలగిపోతాయి. అలానే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లయితే ఒక ఎర్రటి క్లాత్ తీసుకొని అందులో ఐదు పసుపు ఉండలని ఉంచి వాటిని బీరువాలో పెట్టండి.
ఉద్యోగం రాక మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే మీ జేబు రుమాలులో కొంచెం పసుపు వేసి తీసుకువెళ్లండి. ఇది మీ కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది అలానే మిమ్మల్ని విజయవంతులని చేస్తుంది. ఎప్పటినుండో ఈ బాధలతో బాధపడుతున్న వారు ఈ చిన్న చిట్కాని అనుసరించి ఇబ్బందుల నుండి దూరంగా వచ్చేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version