వాస్తు: వ్యాపారంలో నష్టాలు రాకుండా ఉండాలంటే వీటిని అనుసరించాల్సిందే..!

-

ఎలాంటి సమస్యలనైనా వాస్తు తొలగిస్తుంది. వాస్తు దోషాలు కూడా లేకుండా ఉండాలంటే వాస్తు చిట్కాలని తప్పక అనుసరించాలి. అయితే ఈ రోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక ఫాలో అయితే ఇబ్బంది ఉండదు. ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ మరి ఎక్కడైనా సరే వాస్తుని అనుసరించాలి. దిక్కులు అనేది చాలా ముఖ్యం. అయితే చాలా మంది వ్యాపారం చేస్తూ ఉంటారు. కానీ వ్యాపారంలో నష్టాలు కలుగుతూ ఉంటాయి.

అలా నష్టాలు కలగకుండా ఉండాలంటే ఈ వాస్తు చిట్కాలని అనుసరించాలి. ఇలా చేయడం వల్ల నష్టాలు ఉండవు. అయితే మరి పండితులు చెబుతున్న అద్భుతమైన వాస్తు చిట్కాలని ఎలాంటి ఆలస్యం లేకుండా చూసేద్దాం. ఏదైనా వ్యాపారంలో సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ముఖద్వారం చాలా ముఖ్యం. అలాగే వాయువ్యం వైపు అల్మారాలని పెడితే మంచిది. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో లాభాలు కలుగుతాయి.

అలాగే వాస్తు ప్రకారం దక్షిణం వైపు క్యాష్ బాక్స్ ని పెట్టుకోవడం మంచిది. కాబట్టి వ్యాపారం చేసేవాళ్లు దక్షిణ వైపు క్యాష్ బాక్స్ ని పెట్టండి. అలాగే షాపు లోపల మంచి నీళ్ళ కుళాయి ఉంటే మంచిది. ఇది కూడా చక్కటి పాజిటివ్ ఎనర్జీని తీసుకు వస్తుంది. ఇక షాపులో ఎలాంటి రంగులు వేసుకోవాలి అనే విషయానికి వస్తే… ఆఫీసు లేదా షాపుల్లో తెలుపు, క్రీమ్ కలర్ వంటికి వేసుకోవడం మంచిది. క్రిస్టల్ బాల్ టేబుల్ మీద పెట్టడం వల్ల కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా వాస్తు ప్రకారం ఈ విధంగా ఫాలో అయితే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే వ్యాపారంలో లాభాలు పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version