వాస్తు: ఆర్ధిక బాధలు తొలగిపోవాలంటే.. ఇలా చెయ్యండి..!

-

వాస్తు ప్రకారం నడుచుకుంటే మంచే కలుగుతుంది. ఏ ఇబ్బంది ఉండదు. వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉండడం… వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి ధన నష్టంకు సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం మనం నడుచుకుంటే ఆర్థిక సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. పండితులు ఈ రోజు మన కోసం కొన్ని వాస్తు చిట్కాలను చెప్పారు. ఎప్పుడూ కూడా ఇంటిని ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే లక్ష్మీ దేవి మన ఇంటికి వస్తుంది. మరీ ముఖ్యంగా ఈశాన్యం వైపు కచ్చితంగా శుభ్రతని పాటించాలి. అప్పుడే మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది.

అలానే వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం వైపు వాటర్ ఫౌంటెన్ ఉంటే కూడా మంచిది. దీని వలన డబ్బులు వస్తాయి. ఈశాన్యం వైపు వాటర్ ఫౌంటెన్ ఉంటే ధన నష్టం ఉండదు. అలానే ఆగ్నేయం పైపు నీటికి సంబంధించిన వాటిని పెట్టడం మంచిది కాదు. ఇది ఇబ్బందుల్ని తీసుకువస్తుంది. అల్మారా ని కూడా అదే దిక్కున ఉంచండి. ఉత్తరం వైపు అల్మారాని తెరవకూడదు. ఇలా వాస్తు ప్రకారం ఈ విధంగా అనుసరిస్తే సమస్యల నుండి బయటపడడానికి అవుతుంది ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version