వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ వాస్తు ప్రకారం అనుసరిస్తున్నారు నిజానికి వాస్తు ప్రకారం అనుసరిస్తే నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలానే వాస్తు ప్రకారం అనుసరిస్తే ఇంట్లో సమస్యలు మొదలు ప్రతి దానికి కూడా పరిష్కారం దొరుకుతుంది.
పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని పంచుకున్నారు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాస్తు దోషాలు తొలగి పోవాలంటే ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి అని పండితులు అంటున్నారు. పైగా చాలా సమస్యలని ఇవి దూరం చేస్తాయి.
ఉప్పు:
ఉప్పు వాస్తు దోషాలను తొలగిస్తుంది అలానే నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీ కలిగేటట్టు చేస్తుంది. ఇల్లు ఒత్తేటప్పుడు నీళ్లలో కొంచెం సాల్ట్ వేసి ఇంటిని శుభ్రం చేస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వారంలో అన్ని రోజులు మీరు ఇలా చేయొచ్చు కానీ గురువారం మాత్రం ఇలా చేయొద్దు. ఈ విధంగా మీరు అనుసరిస్తే మంచిగా మార్పులు వస్తాయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఆర్ధిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.
కర్పూరం:
ప్రతిరోజు దేవుడికి కర్పూరంతో హారతి ఇవ్వడం వలన ఇంట్లో మంచి జరుగుతుంది వాస్తు దోషాలు తొలగిపోవాలంటే అగర్బత్తి కర్పూరం కలిపి వెలిగిస్తే మంచిది. అలానే ఆనందంగా ఉండడానికి కూడా అవుతుంది.
తులసి మొక్క:
తులసి మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే. మీ ఇంట్లో తులసి మొక్క లేనట్లయితే ఒక తులసి మొక్కని కుండీలో వేయండి ఇది మీకు మంచిని కలిగిస్తుంది అలానే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది.
చప్పట్లు కొట్టండి:
పూజ చేస్తున్నప్పుడు హారతి ఇస్తున్నప్పుడు చప్పట్లు కొడితే కూడా నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.