వాస్తు: భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుకునే మార్గాలివి..!

-

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి భార్యాభర్తలకు సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలంటే ఇలా అనుసరించాలని అంటున్నారు పండితులు. ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే ప్రేమ పెరుగుతుందట. చాలా మంది భార్యాభర్తలు ఏదో ఒక గొడవ పడుతూ ఉంటారు. తరచు వాళ్ళ మధ్య సమస్యలు కలగడం లేదంటే చీటికిమాటికి తిట్టుకోవడం కొట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. నిజానికి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగాలంటే ఈ వాస్తు చిట్కాలు బాగా ఉపయోగపడుతాయి.

పసుపు రంగులో ఉండే పూలని పెట్టండి:

భార్యాభర్తల మధ్య సమస్యలు కలగకుండా ఉండాలంటే ఈ పూలు బాగా ఉపయోగపడతాయి. వీటిని పెట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ కలిగే నెగిటివ్ నుంచి దూరమైపోతుంది. నైరుతి వైపు పసుపు రంగులో వుండే పూలను పెడితే చాలా మంచి కలుగుతుంది.

ఇంట్లో పూల మొక్కల్ని నాటండి:

ఇంట్లో పూల మొక్కలు ఉండటం చాలా మంచిది దీనివల్ల నెగటివ్ ఎనర్జీ దూరం అయ్యి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. వాస్తు దోషాలను తొలగించి భార్యాభర్తల మధ్య ఆనందాన్ని కలిగిస్తుంది.

కలువ పూలని సరస్వతీదేవికి లక్ష్మీదేవికి పెట్టండి:

కలువ పూలని లక్ష్మీదేవికి కానీ సరస్వతి దేవికి కానీ పెడితే కూడా మీ మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇలా ఈ వాస్తు చిట్కాలను అనుసరిస్తే భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది అలానే భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పరిష్కారమవుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version