బీర్ అంటే ఇష్టం తాగుతా : హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

-

నేటి కాలంలో బీర్ తాగడం, సిగరెట్ తాగడం అనేది కామన్. ఒకప్పుడు ఈ అలవాట్లన్నీ మగవారి సొంతమే అనుకునేవారు కానీ.. ఇప్పుడు ఆడవారు కూడా మద్యం, సిగరెట్లు విచ్చలవిడిగా తాగేస్తున్నారు. ఇక మామూలు జనాల సంగతే ఇలా ఉంటే.. సెలెబ్రిటీల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరో హీరోయిన్ల లగ్జరీ లైఫ్‌లో ఇలాంటివన్నీ సర్వసాధారణమే.

అయితే తాము మద్యం సేవిస్తున్నామని మాత్రం బహిరంగంగా చెప్పుకోరు. అలా చెప్పుకోవడానికి కొందరికి సిగ్గు, మొహమాటంలాంటివి అడ్డు వస్తుంటాయి. అయితే ఓ మళయాల నటి మాత్రం నిర్మొహమాటంగా తన అలవాట్ల గురించి చెప్పేసింది. తనకు బీర్లంటే ఇష్టమని, తాగుతానని కుండబద్దలు కొట్టేసినట్టు చెప్పింది.

అంతేకాకుండా.. అందులో తప్పేముందని తిరిగి ప్రశ్నించింది. ఈ మధ్య అందరూ తాగేస్తున్నారని.. తాను తాగితే బాగా మాట్లడగలనని తెలిపింది. తానుతాగడం వల్ల ఎవ్వరికీ ఏ హాని జరగడం లేదని, ఇది తన వ్యక్తిగత నిర్ణయమని చెప్పుకొచ్చింది. ఇక సినిమాల గురించి మాట్లాడుతూ.. మంచి స్క్రిప్ట్ వస్తే ఎలాంటి పాత్ర చేయడానికైనా రెడీ అని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version