ఆయనో ఎంపీ గారు, పార్టీలో ఆయనకు అందరూ శత్రువులే. అధినేతకు మాత్రం అత్యంత ఆప్తుడు. ఆయన గారి గురించి అందరికి తెలుసు గాని ఆయన గురించి ఎవరైనా చెప్తే మాత్రం వినడానికి ఎవరూ ఇష్టపడరు. మాజీ మంత్రి అయినా, ఎమ్మెల్సీ అయినా, చివరికి ఆయనను అంతటి వాడిని చేసిన పార్టీ అయినా సరే ఎంపీ గారికి అంత పెద్ద విషయం కాదు. ఆయన గారు అనుకుంటే ఏదైనా చేయగలరు.
ముఖ్యమంత్రి జగన్ ని తిట్టిన నోటి తోనే సొంత పార్టీ నేతలను కూడా తిట్టే సామర్ధ్యం ఆయనకు. పార్టీ నేతలు ఆయన్ను ప్రశ్నించలేరు. అధినేత ఆయన్ను వద్దని అనలేరు. అలా అని పార్టీకి విధేయుడు కాదా…? పార్టీకి విదేయుడే. ఆయనే విజయవాడ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కేసినేని నానీ. ఇప్పుడు సారు కేంద్ర మంత్రి అవుతారని అంటున్నారు. కేంద్ర మంత్రి ఎవరు అయినా సరే ఆయన వెళ్లి లంచ్ చేయగలరు.
గత కొన్ని రోజులుగా ఆయన టీడీపీ నేతలపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయంగా సమర్ధుడు కాబట్టి చంద్రబాబు ఆయన్ను ఏమీ అనలేని పరిస్థితి. రాజకీయంగానే కాదు ఆర్ధికంగా కూడా సారు కి మంచి బలం ఉంది. అందుకే కేంద్ర మంత్రులు కూడా నానీ గారు అని పార్లమెంట్ లాబీల్లో చక్కగా పిలిచేస్తారు. ఆయన బిజెపిని విభేదిస్తున్నారు. కాని ఆ పార్టీ తో స్నేహం చేస్తున్నారు.
మజ్లీస్ పార్టీ తో స్నేహం చేస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం వద్దని అంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా దానికి ఆమోదం తెలుపుతారు మీరు సభలో బిల్లు ప్రవేశ పెట్టాలని జగన్ కి సవాల్ చేస్తున్నారు. దీనితో ఎప్పుడు ఎం జరుగుతుందో అని టీడీపీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాదు ఇదంతా ఏదో తేడా గా ఉంది. ఆయన కచ్చితంగా బిజెపితో కలిసే ఉన్నారు, జలవనరుల శాఖలో లేదా గడ్కారి శాఖలో ఆయన సహాయ మంత్రి అవుతారని అంటున్నారు. సోషల్ మీడియాలో ఇదే పెద్ద చర్చ.