గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హోటల్స్ నిర్వాహకుల తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ఫుడ్ సేఫ్టీ అధికారుల చెకింగ్ సరిగా లేకపోవడంతో హోటల్స్ నిర్వాహకులు రెచ్చిపోతున్నట్లు సమాచారం.నగరంలో కొన్ని లక్షల మంది రోజువారీ బయట ఆహారం తీసుకుంటుంటారు.
దీనిని కొన్ని హోటల్స్, ఫుడ్ సెంటర్స్ నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు. నాసిరకం ఫుడ్ సప్లయ్ చేసి లక్షలు సంపాదిస్తున్నారు. ప్రజల ప్రాణాలంటే వారికి లెక్కలేకుండాపోయింది.తాజాగా ఓ కస్టమర్ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేయగా అందులో చికెన్ ముక్క వచ్చింది. అమీర్‌పేటలోని రాజుగారి బిర్యానీలో ఈ ఘటన ఆదివారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.ఇదేంటని రెస్టారెంట్‌కు కాల్ చేయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని.. దీంతో సదరు రెస్టారెంట్‌పై చర్యలు తీసుకోవాలని కస్టమర్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
వెజ్ బిర్యానీలో చికెన్ ముక్క!
హైదరాబాద్: అమీర్‌పేటలోని రాజుగారి బిర్యానీ నుంచి ఓ కస్టమర్ వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాడు. ఆ వెజ్ బిర్యానీలో చికెన్ ముక్క వచ్చింది. రెస్టారెంట్‌కు కాల్ చేయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని.. ఆ రెస్టారెంట్‌పై చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను… pic.twitter.com/jnwFrbNDon
— ChotaNews App (@ChotaNewsApp) April 6, 2025