కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. మైనింగ్ కాలేజీని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దింతో దేశంలో తొలిసారిగా తెలంగాణలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. ఇక తెలంగాణ ఖ్యాతి జాతీయ స్థాయిలో పెరగనుంది.

కాగా, నేడు సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా భద్రాచలానికి వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా భద్రాచలానికి వెళ్లనున్నారు. ఈ సందర్బంగా రాముల వారి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున శ్రీసీతారామచంద్ర స్వామికి రాములవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. స్వామి వారి కళ్యాణోత్సవాన్ని కుటుంబంతో కలిసి తిలకించనున్నారు.