కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయి శ్రీనగర్‌కాలనీలో కూరగాయలు అమ్ముతూ వార్తల్లో నిలిచిన సాఫ్ట్‌వేర్ శారద దుకాణంలో చోరీ జరిగింది. రోజువారీ లాగే రాత్రి ఆమె దుకాణం మూసివేసి మిగిలిన కూరగాలను అక్కడే బండిపై ఉంచి కవర్‌తో కప్పి ఇంటికి వెళ్లిపోయారు. ఉదయం వచ్చి చూసేసరికి మొత్తం కూరగాయలు మాయయ్యాయని, ఖాళీ బండి మాత్రమే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ.5వేల విలువైన కూరగాయలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపింది.
ఇదిలావుంటే.. తన తండ్రి కూరగాయలు విక్రయించేటప్పటి నుంచి రాత్రి సమయంలో మిగిలిన కూరగాయలను రాత్రి సమయంలో బండిపైనే పెట్టి కవరు కప్పి వెళతారు. అయినా ఇప్పటివరకు ఎన్నడూ దొంగతనం జరగలేదని శారద వివరించింది. కాగా, ఆమె కనబర్చిన పోరాట స్ఫూర్తికి సినీ నటుడు సోనూసూద్ స్పందించి ఉద్యోగం ఇస్తానంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.