వంగవీటి రాధాపై వెల్లంపల్లి ఫైర్..నీ ఇంటి దగ్గర కారు తిరిగితే రెక్కియేనా ?

-

వంగవీటి రాధా, రాధా రెక్కీ అంశంపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్ చేశారు. హత్యకు రెక్కీ ఆధారాలు ఉంటే రాధా బయట పెట్టాలని.. రెక్కీ ఎవరు చేయబోయారో రాధా బయటపెట్టాలని ఫైర్ అయ్యారు. రాజకీయ లబ్ది కోసం రాధా చంద్రబాబు చెప్పినట్టు చేయకూడదని మండిపడ్డారు. ఇప్పటికే రాధాను రాజకీయాల్లో మర్చిపోయారని.. చంద్రబాబు తప్పుడు డైరెక్షన్ లో రాధా ప్రయాణం చేయకూడదని చురకలు అంటించారు. రంగా టీడీపీ హయాంలో ఎందుకు దీక్ష చేశారు రాధా తెలుసుకోవాలని.. టీడీపీ హయాంలో రంగా హత్య జరిగితే అదే పార్టీతో రాధా అంటకాగుతున్నారన్నారు.

చంద్రబాబుతో ప్రభుత్వంపై రాధా మాట్లాడిస్తున్నారని.. రెక్కీపై ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేసారా ? అని నిలదీశారు. మెయిన్ రోడ్డులో రాధా ఇల్లు ఉంది, అక్కడ కారు తిరిగితే రెక్కీ అవుద్దా ? హత్యా రెక్కీ అంటారు, భద్రతకి గన్ మెన్లను పంపితే వెనక్కి పంపి చీప్ రాజకీయాలు చేస్తారా? అని ప్రశ్నించారు. రాధా రెక్కీ అంశంపై వెంటనే స్పందించిన వ్యక్తి సీఎం జగన్ అని.. రాధా మా పార్టీకి సంబందంలేని వ్యక్తయినా గన్ మెన్లను కేటాయించారన్నారు. రాధాకు చంద్రబాబు పరామర్శ దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మొరిగానట్టు కాదని.. రాధా అనుమానం ఉందని ఏనాడైనా చెప్పారా ?అని ప్రశ్నించారు. అసెంబ్లీలో భువనేశ్వరి గురించి మాట్లాడకపోయినా చంద్రబాబు సింపతీ కోసం ఎక్కెక్కి ఏడ్చాడని.. రాజకీయాలో ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. వంగవీటి రాధాతో చంద్రబాబు డ్రామా చేయిస్తున్నాడని అగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version