మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని ప్రముఖ ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్న ఆలయంలో శివరాత్రి వేడుకలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. భక్తులు భారీగా రానున్నందున వేసవిని దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు, కార్పెట్లతో పాటు టెంపుల్‌కు లైటింగ్, ప్రత్యేక పార్కింగ్, పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.
వేములవాడలో ఈనెల 25,26,27 తేదీల్లో జాతర నిర్వహించనున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. జాతర సందర్భంగా నిర్వహించే పలు కార్యక్రమాలకు గుడి చెరువు వద్దగల మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సొంత వాహనాలలో వచ్చే వారు తిప్పాపూర్ వద్ద పార్కింగ్ చేసుకోవాలని..అక్కడి నుంచి ప్రధాన ఆలయం వరకు ఉచిత బస్సు సర్వీసులను నడపనున్నట్టు అధికారులు తెలిపారు.