నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలోని ముత్తుకూరులో తయారు చేసిన ఆయుర్వేదం కరోనా మందుపై ఇప్పుడు దేశం మొత్తం ఆసక్తిగా చూస్తుంది. వేలాది మంది ఆ మందు కోసం అక్కడికి వెళ్తున్నారు. ఆస్పత్రుల్లో ఆక్సీజన్ లెవెల్ పడిపోయిన వాళ్ళు కూడా చికిత్స మానేసి అక్కడికి వెళ్లి ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా అక్కడ 2 వేలకు పైగా అంబులెన్స్ లు ఉన్నాయని గుర్తించారు.
ఇక తోపులాట కూడా భారీగా జరిగింది. దీనితో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఇదిలా ఉంటే ఈ మందుపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. వెంటనే ఆనందయ్య ఆయుర్వేదం మందుకు సంబంధించి ఐసిఎంఆర్, ఆయుష్ రెండూ కూడా పరిశోధన చేసి నివేదిక ఇవ్వాలని సూచన చేసారు. ఆయుష్ మంత్రితో మాట్లాడి వెంటనే నివేదిక వచ్చే విధంగా చొరవ తీసుకోవాలని సూచించారు.