శైలేష్ కొలనుతో వెంకటేష్ 75వ సినిమా..పోస్టర్ రిలీజ్

-

విక్టరీ వెంకటేష్ రాబోయే తన 75వ సినిమా ప్లాన్ చేస్తున్నారు. అందుకు చాలామంది యువ డైరెక్టర్లతో చర్చలు జరిపి చివరికి శైలేష్ కోలనుతో సినిమా చేయబోతున్నారు. ఈ ఇద్దరు కాంబినేషన్లో వచ్చే సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

భారీ బడ్జెట్ తో తీయబోతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈనెల 26న జరగనున్నాయి. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే, తాజాగా దీనిపై అధికారిక ప్రకటన చేశారు వెంకీ మామ. ఈ నెల 25వ తేదీన ఓ అనౌన్స్‌ మెంట్‌ ఉంటుందని ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా తన ట్విట్టర్‌ వేదికగా రివీల్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version