కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన హీరో వెంక‌టేష్

-

టాలీవుడ్ అగ్ర హీరో విక్ట‌రీ వెంక‌టేష్ కొత్త బిజినెస్ ను స్టార్ట్ చేశాడు. ప్ర‌స్తుతం కాలంలో ఎంతో మంది ఉప‌యోగిస్తున్న ఎలక్ట్రిక్ వాహ‌న రంగంలోకి హీరో విక్ట‌రీ వెంక‌టేష్ అడుగు పెట్టాడు. హైద‌రాబాద్ కు చెందిన ఎలిక్ట్రిక్ వెహిక‌ల్ స్టార్ట‌ప్ కంపెనీ అయిన బైక్ వో లో హీరో వెంక‌టేష్ పెట్టుబ‌డులు పెట్టాడు. ఇది ఈవీ టూ వీల‌ర్ స్మార్ట్ హ‌బ్ నెట్ వ‌ర్క్ గా ఉంటుంది. ఈ కంపెనీ ఈవీ రంగంలో ఉండే బైక్ లకు ఛార్జింగ్ తో పాటు స‌ర్వీసింగ్ వంటి స‌దుపాయాల‌ను కల్పింస్తుంది. ఈ బైక్ వో కంపెనీ 2025 వ‌ర‌కు దేశ వ్యాప్తంగా విస్త‌రించాల‌ని ప్లాన్ చేస్తుంది.

అందులో భాగంగా 20,000 ఎల‌క్ట్రిక్ వాహ‌న ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాడానికి రంగం సిద్ధం చేస్తుంది. అలాగే ఈ బైక్ వో కంపెనీకి పార్ట్ న‌ర్ గానే కాకుండా బ్రాండ్ అంబాసిడ‌ర్ గా కూడా హీరో విక్ట‌రీ వెంక‌టేష్ వ్య‌వ‌హ‌రిస్తాడు. అయితే ఈ మ‌ధ్య కాలంలో పెట్రోల్, డిజిల్ ధ‌ర‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ఉప‌యోగం భారీ స్థాయిలో పెరిగింది. భ‌విష్య‌త్తులో కూడా వినియోగం పెరిగే అవ‌కాశం ఉంది. అందువ‌ల్ల ఈవీ బైక్ ల‌కు ఛార్జీంగ్, స‌ర్విసింగ్ సెంట‌ర్లకు డిమాండ్ భారీగా పెరిగే అవ‌కాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version