ఎన్నికల సందర్భంగా నేను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రాణాలను రక్షించుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చిందనే విషయాన్ని చెప్పానని, ప్రాణాలకు రాజ్యాంగం ఎంత విలువ ఇచ్చిందోననే విషయాన్నే చెప్పానని అన్నారు. రాజ్యాంగంలో ఉన్న అంశాలను కాదనగలరా..? అని ప్రశ్నించిన ఆయన కొందరు టీడీపీ నేతలు ఇష్టానుసారంగా నన్ను వాడూ వీడూ అంటున్నారు, నన్ను విమర్శించే టీడీపీ నేతలను నేను అరేయ్ ఒరేయ్ అనలేనా..? ఒళ్లు బలిసి కొట్టుకుంటున్నావని అనలేనా..? అని ప్రశ్నించారు.
ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్న ఆయన రేపు సుప్రీం ఎన్నికలు జరపమని తీర్పు ఇచ్చినా.. నామినేషన్ల ప్రక్రియ జరిగే పరిస్థితి ఉందా..? అని ప్రశ్నించారు. ఎన్నికలు జరిగే వాతవరణం ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. సీనియరైన నిమ్మగడ్డకు ఇవన్నీ తెలీదా..? అని ఆయన ప్రశ్నించారు. సిద్దంగా ఉన్న ఉద్యోగులతో ఎన్నికలు చేపట్టుకోవచ్చు. ఏవేవో కామెంట్లు చేసే టీడీపీ నేతలు సిద్దంగా ఉన్న ఉద్యోగులతో ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీకి లేఖ రాయగలరా..? అని ప్రశ్నించారు.