వెన్నెల కిషోర్‌ హీరోగా ఫన్‌ స్పై సినిమా

-

వెన్నెల సినిమాలో తన కామెడీతో అందర్నీ మెప్పించి ఆ సినిమానే తన ఇంటిపేరుగా మారేలా స్టార్ కమెడియన్ గా ఎదిగాడు వెన్నెల కిషోర్. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నుంచి కమెడియన్ గా మారిపోయిన వెన్నెల కిషోర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కమెడియన్ గా దూసుకుపోతున్నాడు వెన్నెల కిషోర్. ఆ మధ్య డైరెక్టర్ గా కూడా ఓ రెండు సినిమాలు చేశాడు.
వెన్నెల కిషోర్ హీరోగా రాణించడానికి ముందుకు వస్తున్నారు. ఫన్, స్పై, యాక్షన్ ఫిల్మ్ గా చారీ 111 మూవీ రాబోతుంది. టిజీ కీర్తికుమార్ డైరెక్ట్ చేయబోతున్న చారీ 111 మూవీ అనౌన్స్ మెంట్ తో పాటు, యానిమేషన్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ మూవీలో వెన్నెల కిశోర్ సీక్రెట్, స్పై ఏజెంట్గా యాక్ట్ చేస్తున్నారు. స్పెషల్ గా రిలీజ్ చేసిన వీడియోలో.. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే సిటీకి ఒక ప్రమాదం వచ్చిందంటూ స్టార్ట్ కాగా.. ఆ ప్రమాదాన్ని ఎదిరించడానికి వచ్చిన ఎస్ ఆర్మీ ఆఫీసర్ మురళీశర్మ ఏజెంట్ సంస్థకి లీడర్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ కథలో విలన్స్, ప్రాబ్లమ్స్ ఉన్నట్టే..వీరిని పేస్ చేయడానికి ఒక హీరో ఉన్నాడు..అంటూ హీరో వెన్నెల కిషోర్ను రివీల్ చేసిన వీడియో ఆకట్టుకుంటుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version