బీజీపీ లోకి చేరిన లాల్ బహదూర్ శాస్త్రి మనవడు..!

-

మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి మనవడు విభాకర్ శాస్త్రి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసారు. తన రాజీనామా లేఖని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కి పంపించారు కాంగ్రెస్ కి రాజీనామా చేసిన వెంటనే బిజెపిలో చేరారు విభాకర్ శాస్త్రి. ఉత్తర ప్రదేశ్ లో డిప్యూటీ సీఎం బ్రెజేష్ పాఠక్ సమక్షంలో కాషాయ కండువాని కప్పుకున్నారు.

లాల్ బహుదూర్ శాస్త్రి మనవడు విభాకర్ శాస్త్రి తనని బిజెపిలోకి అనుమతించినందుకు మోడీ నడ్డ అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ రాజేష్ పాఠకులకు కృతజ్ఞతలు చెప్పారు. లాల్ బహుదూర్ శాస్త్రి దార్శనికతని ముందుకు తీసుకువెళ్తానని విభాకర్ శాస్త్రి చెప్పారు పార్టీ ఆదేశాల మేరకే పని చేస్తానని అన్నారు. ఇండియా కూటమికి ఇండియా సిద్ధాంతం లేదని కేవలం మోడీని తొలగించడమే దాని లక్ష్యం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version